ఇజ్రాయిల్
From Wikipedia, the free encyclopedia
ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు.[18] దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.[18] వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలు కూడా ప్రక్కనే ఉన్నాయి.[19] టెల్ అవివ్ ఇజ్రాయిల్ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా ఉంది.[20] జెరుసలేం ఇజ్రాయిల్ స్వయంనిర్ణిత రాజధానిగా ఉంది. దీనిని ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు.[21])Rabinovich, Itamar; Reinharz, Jehuda (2007). Israel in the Middle East: Documents and Readings on Society, Politics, and Foreign Relations, Pre-1948 to the Present. Brandeis. p. 74. ISBN 978-0-87451-962-4. అంతేకాక జెరుసలేం నగరం ఇజ్రాయల్ దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. జెరుసలేం మీద ఇజ్రాయేల్ స్వాధికారత అంతర్జాతీయంగా వివాదాస్పదంగా ఉంది.[note 1][22]
State of Israel మూస:Script/Hebrew (Hebrew) మూస:Script/Arabic (Arabic) | |
---|---|
గీతం: మూస:Script/Hebrew (Hatīkvāh; "The Hope")మూస:Parabr | |
Israel within internationally recognized borders shown in dark green; Israeli-occupied territories shown in light green | |
రాజధాని | Jerusalem (limited recognition)[fn 1][fn 2] 31°47′N 35°13′E |
Official language | Hebrew |
Recognized language | Arabic[fn 3] |
జాతులు (2022)[11] |
|
మతం (2022)[11] |
|
పిలుచువిధం | Israeli |
ప్రభుత్వం | Unitary parliamentary republic |
• President | Isaac Herzog |
• Prime Minister | Benjamin Netanyahu |
• Knesset Speaker | Amir Ohana |
• Chief Justice | Esther Hayut |
శాసనవ్యవస్థ | Knesset |
Independence out of British Palestine | |
• Declaration | 14 May 1948 |
• Admission to the United Nations | 11 May 1949 |
• Basic Laws | 1958–2018 |
విస్తీర్ణం | |
• మొత్తం | 20,770–22,072 km2 (8,019–8,522 sq mi)[a] (149th) |
• నీరు (%) | 2.71 (as of 2015)[12] |
జనాభా | |
• 2024 estimate | మూస:Data Israel[13][fn 4] (91st) |
• 2008 census | 7,412,200[14][fn 4] |
• జనసాంద్రత | [convert: invalid number] (29th) |
GDP (PPP) | 2023 estimate |
• Total | $533.9 billion[15] (48th) |
• Per capita | $55,540[15] (29th) |
GDP (nominal) | 2023 estimate |
• Total | $539.2 billion[15] (29th) |
• Per capita | $55,535[15] (13rd) |
జినీ (2018) | 34.8[fn 4][16] medium |
హెచ్డిఐ (2021) | 0.919[17] very high · 22nd |
ద్రవ్యం | New shekel (₪) (ILS) |
కాల విభాగం | UTC+2:00 (IST) |
• Summer (DST) | UTC+3:00 (IDT) |
తేదీ తీరు |
|
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +972 |
ISO 3166 code | IL |
Internet TLD | .il |
|
దీని జనాభా దాదాపు 72.8 లక్షలు,[23] మెజారిటీలు యూదులు. యూదులకు ప్రపంచంలో ఒకే ప్రదేశం, దేశం గలదు, అది ఇస్రాయీల్.[24] మైనారిటీ మతస్తులు సమారిటన్లు, అరబ్బులు, ఉదా: ముస్లింలు, క్రైస్తవులు, డ్రూజ్లు.గాజాపై చేస్తున్న కాల్పులను విరమించుకోవాలని ప్రపంచమంతా ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ తన ధోరణి మార్చుకోనందున ఇజ్రాయెల్ తో వెనిజులా, బొలీవియా దేశాలు సంబంధాలను రద్దు చేసుకున్నాయి. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపును కూడా కాలదన్ని ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న తీరు పాలస్తీనా ప్రజల పాలిట శాపమని ఆ దేశాలు అభిప్రాయపడ్డాయి.
1947 నవంబరు 29న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ పార్టీషన్ ప్లాన్ స్వీకరించి అమలుచేయాలని ఇజ్రాయీలుకు సిఫారసు చేసింది. యునైటెడ్ నేషన్స్ ప్లాన్ అరబ్, ఇజ్రాయిల్ సరిహద్దులను సవరిస్తూ జెరుసలేం, పరిసరాలను ఐక్యారాజ్యసమితి పాలనలో ఉండాలని సూచించింది.[25][26] బ్రిటిష్ మాండేట్ ఫర్ పాలస్తీనా 1948 మే 14 అర్ధరాత్రిలో నిర్ణయించబడింది. వరల్డ్ జియోనిస్ట్ ఎగ్జిక్యూటివ్ హెడ్, పాలస్తీనా ఇజ్రాయిల్ జూవిష్ ఏజెన్సీ అధ్యక్షుడు ఇజ్రాయిల్ స్వతంత్రం ప్రకటించిన రోజు జూయిష్ రాజ్యస్థాపన సంభవించింది.[27][28][29] The borders of the new state were not specified in the declaration.[26][30] తరువాత పొరుగున ఉన్న అరేబియన్లు దాడి చేసి ఇజ్రాయీల్ సైనికులతో పోరాడరు (1948 అరబ్- ఇజ్రాయిల్ యుద్ధం ).[31][32] తరువాత ఇజ్రాయిల్ పొరుగున ఉన్న అరబ్ దేశాలతో యుద్ధాలు కొనసాగిస్తూ ఉంది (ఇజ్రాయిల్ యుద్ధాలు). [33] ఫలితంగా ఇజ్రాయిల్ ది వెస్ట్ బ్యాంక్, సినై పెనిన్సులా (1956-57-82), దక్షిణ లెబనాన్ కొంతభాగం (1982-2000), గాజా పట్టీ, గోలన్ హైట్స్ భూభాగాలను ఆక్రమిచింది.[34][35][36][37] ఇజ్రాయిల్ పాలస్తీనా కలహాలు పరిష్కరించడానికి చేసిన శాంతి ప్రయత్నాలు ఇరుదేశాల మద్య శాంతిని స్థాపించలేకపొయ్యాయి. అయినప్పటికీ ఇజ్రాయిల్- ఈజిప్ట్, ఇజ్రాయిల్- జోర్డాన్ శాంతి ప్రయత్నాలు ఫలించి విజయవంతంగా సంతకాలు జరిగాయి. గజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరుసలేం ఆక్రమణలు ఆధునిక కాలంలో దీర్ఘకాల సైనికచర్యగా నమోదుచేయబడ్డాయి. [note 2][39]
ఇజ్రాయిల్ సెంట్రల్ బ్యూరో చేత సేకరించబడిన ఇజ్రాయిల్ గణాంకాలు అనుసరించి 2014 ఇజ్రాయేల్ జనసంఖ్య 8,146,300. ఇజ్రాయిల్ ప్రజలలో 6,212,000 (74.9%) మంది యూదులు. ప్రపంచంలో యూదుల సంఖ్య ఆధిక్యత వహిస్తున్న ఏకైక దేశం ఇజ్రాయిల్ మాత్రమే. దేశంలో జనసంఖ్యాపరంగా 1,718,400 సంఖ్యతో అరేబియన్లు రెండవ స్థానంలో ఉన్నారు (డ్రూజ్, తూర్పు జ్రుసలేం ప్రాంతాలు) .[40][41] ఇజ్రాయిల్ అరేబియన్లలో అత్యధికులు ముస్లిములు. వీరిలో గుర్తించతగినంతగా నెగెవ్ బెదోయిన్లు ఉన్నారు. మిగిలినవారిలో ఇజ్రేల్ క్రైస్తవులు, ఇజ్రేయిల్ డ్రుజ్ ప్రజలు ఉన్నారు. ఇతర అల్పసంఖ్యాకులలో మెరోనిటీలు, సమరిటియన్లు, డోం ప్రజలు, రోమన్ ఉద్యోగులు, ఆఫ్రికన్ హెబ్ర్యూ ఇజ్రేలీలు, ఇతర సబ్ - సహరన్ ఆఫ్రికన్లు ఉన్నారు.[42] అమెరికన్లు, సికాసియన్లు, వియత్నామీ నావికులు, ఇతరులు ఉన్నారు. ఇజ్రాయిల్లో కూడా గణనీయంగా ఇజ్రాయిలేతర విదేశీ ఉద్యోగులు, ఆసియా, ఆఫ్రికా శరణార్ధులూ ఉన్నారు.[43] బేసిక్ లా ఆధారంగా ఇజ్రాయిల్ తనకుతాను ప్రజాతంత్ర యూదుదేశంగా ప్రపంచానికి తెలియజేస్తుంది.[44] ఇజ్రాయేల్ ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక ప్రజాతంత్రదేశం.[45][46][47] ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. ఇజ్రాయిల్ అభివృద్ధి చెందిన దేశం. ఇజ్రాయిల్ ఎకనమిక్ కో- ఆపరేషన్, డెవెలెప్మెంట్ సభ్యత్వం కలిగిన దేశాలలో ఒకటి.[48] జి.డి.పి పరంగా ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా 37వ స్థానంలో ఉంది. విద్యాపరంగా ఇజ్రాయిల్ అధికసంఖ్యలో పట్టభద్రలు కలిగిన దేశంగా గుర్తించబడుతుంది.[49][50] మానవాభివృద్ధి, నాణ్యమైన జీవనశైలి,[51][52][53] అత్యధిక ఆయుఃప్రమాణం కలిగిన దేశాలలో ఇజ్రాయిల్ ఒకటి.