రష్యా
From Wikipedia, the free encyclopedia
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది. రష్యాకి ఇరుగు పొరుగు దేశాలు (అపసవ్య దిశలో - ): నార్వే, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్బైజాన్, కజకస్తాన్, చైనా, మంగోలియా, ఉత్తర కొరియా. అమెరికా సంయుక్త రాష్ట్రాల కు,జపాన్‌కు కూడా రష్యా కొద్ది దూరంలోనే ఉంది. బేరింగ్ జల సంధి రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే, లా-పెరౌసీ జల సంధి రష్యాను జపాన్ నుండి విడదీస్తుంది.
రష్యా పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం రష్యా (అయోమయ నివృత్తి) చూడండి. |
రష్యా సమాఖ్య Российская Федерация Rossiyskaya Federatsiya | |
---|---|
గీతం: "Государственный гимн Российской Федерации" "Gosudarstvennyy gimn Rossiyskoy Federatsii" (transliteration) "State Anthem of the Russian Federation" | |
Russia proper (dark green) Disputed Crimean peninsula (internationally viewed as territory of Ukraine, but de facto administered by Russia) (light green)[2] | |
రాజధాని | మాస్కో |
అధికార భాషలు | దేశమంతటా రష్యన్ అధికారిక భాష; ఇంకా 27 భాషలు వేర్వేరు ప్రాంతాల్లో ఇతర అధికారిక భాషలు |
జాతులు (2010[3]) |
|
పిలుచువిధం | Russians (Rossiyane) |
ప్రభుత్వం | Federal semi-presidential constitutional republic |
• President | Vladimir Putin |
• Prime Minister | Dmitry Medvedev |
• Chairman of the Federation Council | Valentina Matviyenko |
• Chairman of the State Duma | Sergey Naryshkin |
శాసనవ్యవస్థ | Federal Assembly |
• ఎగువ సభ | Federation Council |
• దిగువ సభ | State Duma |
Formation | |
862 | |
• Kievan Rus' | 882 |
• Grand Duchy of Moscow | 1283 |
• Tsardom of Russia | 16 January 1547 |
• Russian Empire | 22 October 1721 |
• Russian SFSR | 6 November 1917 |
10 December 1922 | |
• Russian Federation | 25 December 1991 |
• Adoption of the current Constitution of Russia | 12 December 1993 |
విస్తీర్ణం | |
• మొత్తం | 17,098,242 (Crimea[convert: unknown unit] (1st) |
• నీరు (%) | 13[5] (including swamps) |
జనాభా | |
• 2014 estimate | 143,800,000[6] (9th) |
• జనసాంద్రత | 8.4/km2 (21.8/sq mi) (217th) |
GDP (PPP) | 2014 estimate |
• Total | $2.630 trillion[7] (6th) |
• Per capita | $18,408[7] (58th) |
GDP (nominal) | 2014 estimate |
• Total | $2.092 trillion[7] (9th) |
• Per capita | $14,645[7] (51st) |
జినీ (2011) | 41.7[8] medium · 83rd |
హెచ్‌డిఐ (2013) | 0.778[9] high · 57th |
ద్రవ్యం | Russian ruble (RUB) |
కాల విభాగం | UTC+3 to +12a |
తేదీ తీరు | dd.mm.yyyy |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +7 |
Internet TLD |
|
|
Российская Федерация Rossiyskaya Federatsiya Russian Federation |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం none |
||||||
జాతీయగీతం హిమ్ ఒఫ్ ద రష్యన్ ఫెడెరేషన్ |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | మాస్కో 55°45′N 37°37′E | |||||
అధికార భాషలు | రష్యన్, ఇంకా చాలా వివిధ రిపబ్లిక్లలో | |||||
ప్రభుత్వం | Semi-presidential federation | |||||
Independence | ||||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 17,075,200 కి.మీ² (1st) 6,592,745 చ.మై |
||||
- | జలాలు (%) | 0.5 | ||||
జనాభా | ||||||
- | 2005 అంచనా | 143,202,000 (7th) | ||||
- | 2002 జన గణన | 145,513,037 | ||||
- | జన సాంద్రత | 8.4 /కి.మీ² (178th) 21.7 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $1.778 trillion (7-9th) | ||||
- | తలసరి | $12,254 (54th) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.795 (medium) (62nd) | |||||
కరెన్సీ | రూబల్ (RUB ) |
|||||
కాలాంశం | (UTC+2 to +12) | |||||
- | వేసవి (DST) | (UTC+3 to +13) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ru, .su reserved | |||||
కాలింగ్ కోడ్ | +7 |
3 వ, 8 వ శతాబ్దాల మధ్యకాలంలో ఐరోపాలో తూర్పు స్లావ్లు గుర్తించదగిన సమూహాలుగా ఉద్భవించాయి.[10] వరంగియన్ యోధుల ప్రముఖులు, వారి వారసులు స్థాపించి, పాలించారు. 9 వ శతాబ్దంలో మధ్యయుగ రాస్ దేశం ఉద్భవించింది. 988 లో నుండి బైజాంటైన్ సామ్రాజ్యం ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీని స్వీకరించింది.[11] తర్వాతి సహస్రాబ్దిలో రష్యన్ సంస్కృతిగా భావించబడిన బైజాంటైన్, స్లావిక్ సంస్కృతుల సంశ్లేషణ ప్రారంభమైంది.[11] 13 వ శతాబ్దంలో మంగోల్ దండయాత్ర తరువాత రస్ భూభాగాలు అనేక చిన్న రాజ్యాలుగా విచ్ఛిన్నమై చివరకు సంచార " గోల్డెన్ హార్డే "కు సామంత రాజ్యాలుగా మారాయి.[12] " గ్రాండ్ డచీ ఆఫ్ మాస్కో " ఆధ్వర్యంలో క్రమంగా రష్యన్ రాజ్యాలు సమైక్యమై గోల్డెన్ హార్డే నుండి స్వాతంత్ర్యం సాధించి కీవన్ రస్ సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని ఆధిపత్యం కొనసాగింది. 18 వ శతాబ్దంనాటికి ఈ దేశం పశ్చిమంలో పోలాండ్ నుండి తూర్పున అలస్కా వరకు విస్తరించి చరిత్రలో మూడవ అతిపెద్ద సామ్రాజ్యం అయిన రష్యా సామ్రాజ్యం అవ్వటానికి విజయం, విలీనం, అన్వేషణ ద్వారా విస్తృతంగా విస్తరించింది.[13][14]
రష్యన్ విప్లవం తరువాత " రష్యా సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ " యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అతిపెద్ద, ప్రధాన విభాగంగా మారింది. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగబద్ధమైన సామ్యవాద రాజ్యం అయింది.[15] సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల గెలుపులో నిర్ణయాత్మక పాత్ర పోషించింది.[16][17] ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో యునైటెడ్ స్టేట్స్కు గుర్తించదగిన సూపర్ పవర్‌గా, ప్రత్యర్థిగా ఉద్భవించింది. 20 వ శతాబ్దంలో సోవియట్ యుగం అత్యంత ముఖ్యమైన సాంకేతిక విజయాల్లో కొన్నింటిని కలిగి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహాన్ని పంపించినది, అంతరిక్షంలోనికి మొదట మానవులను పంపించినదీ సోవియట్ యూనియనే. 1990 చివరినాటికి సోవియట్ యూనియన్లు ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక స్థావరాలు, భారీ విధ్వంస ఆయుధాల నిల్వలు ఉన్నాయి.[18][19][20] 1991 లో సోవియట్ యూనియన్ రద్దు తరువాత యు.ఎస్.ఎస్.ఆర్ నుండి పన్నెండు స్వతంత్ర రిపబ్లిక్ లు పుట్టుకొచ్చాయి: రష్యా, ఉక్రెయిన్, బెలారస్, కజాగిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్ బైజాన్, జార్జియా, కిర్గిజ్ స్థాన్, మోల్డోవా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, బాల్టిక్ దేశాలు స్వాతంత్ర్యం పొందాయి: ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా; రష్యన్ ఎస్.ఎఫ్.ఎస్.ఆర్.అనేది రష్యన్ ఫెడరేషన్‌గా పునఃస్థాపించబడింది. సోవియట్ యూనియన్ కొనసాగింపు చట్టబద్ధమైన ప్రత్యేకత, ఏకైక వారసత్వ దేశంగా గుర్తింపు పొందింది. దీనిని ఫెడరల్ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్‌గా పరిగణిస్తారు.
2015 లో రష్యన్ ఆర్థికవ్యవస్థ నామమాత్ర జి.డి.పి ద్వారా పన్నెండవ అతిపెద్ద దేశంగా, సమాన కొనుగోలు శక్తి ఆరవ స్థానంలో ఉంది.[21] రష్యా లోని విస్తృతమైన ఖనిజ, ఇంధన వనరులు ప్రపంచంలోనే అతి పెద్ద నిల్వలు [22] ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిదారులలో ఇది ఒకటి.[23][24] ఈ దేశం ఐదు గుర్తింపు పొందిన అణ్వాయుధ దేశాలలో ఒకటి. సామూహిక వినాశక ఆయుధాల అతిపెద్ద నిల్వలను కలిగి ఉంది. రష్యా ఒక గొప్ప ప్రపంచ శక్తి, ఒక ప్రాంతీయ శక్తి, సుసంపన్నమైన శక్తిగా వర్గీకరించబడింది. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం, అలాగే జి 20, కౌన్సిల్ ఆఫ్ ఐరోపా, ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఎ.పి.ఇ.సి.) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ.), సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ సంస్థ ఐరోపాలో (ఒ.ఎస్.సి.ఇ.), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబల్యూ.టి.ఒ), అలాగే కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సి.ఐ.ఎస్), కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సి.ఎస్.టి.ఒ.) ప్రముఖ సభ్యదేశంగా, ఆర్మేనియా, బెలారస్, కజగిస్తాన్, కిర్గిస్తాన్‌లతో ఐదుగురు సభ్యదేశాలలో ఒకటిగా యురేషియా ఎకనామిక్ యూనియన్ (ఇ.ఇ.యు) ఉంది.
గతములో ప్రబల గణతంత్రమైన యు ఎస్ ఎస్ ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్), డిసెంబరు 1991లో విడిపోయినప్పుడు రష్యా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడినది. ఈనాటికి కూడా రష్యా కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో ఒక ప్రభావవంతమైన దేశం. సోవియట్ సమాఖ్యలో ఉన్నప్పుడు రష్యాని రష్యన్ సోవియట్ ఫెడెరేటెడ్ సోషియలిస్ట్ రిపబ్లిక్స్ (ఆర్ ఎస్ ఎఫ్ ఎస్ ఆర్) అని పిలిచేవారు.
సోవియట్ యూనియన్ అత్యధిక భూభాగం, జనసంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి ఆనాటి రెండు ప్రపంచ శక్తులలో ఒకటైన రష్యాలో విలీనం అయ్యాయి. కావున యు.ఎస్.ఎస్.ఆర్ విభజించబడిన తరువాత రష్యా కోల్పోయిన తన గత ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఈ ప్రభావము గుర్తింపు గణనీయం అయినా గత సోవియట్ యూనియన్‌తో పోలిస్తే చెప్పుకోదగ్గవి కావు.