హ్యూస్టన్
అమెరికాలో పెద్ద నగరాలలో నాల్గవది / From Wikipedia, the free encyclopedia
హ్యూస్టన్ (ఆంగ్లం: Houston) అమెరికాలో పెద్ద నగరాలలో నాల్గవది. అంతేకాక టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. 2000ల జనాభా లెక్కల ప్రకారం 600 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 22 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ నగరం హెరిస్ కౌంటీ యొక్క నిర్వహణా కేంద్రం. గ్రేటర్ హ్యూస్టన్‌గా పిలవబడే ఈ నగరం 56 లక్షల జనాభాతో అమెరికాలోనే అతి పెద్ద మహానగరమైన హ్యూస్టన్-షుగర్ లాండ్-బేటౌన్ కు లకు లకు హ్యూస్టన్ నగరం వ్యాపార కేంద్రం.
హ్యూస్టన్ నగరం 1836 ఆగస్టు 30వ తారీఖున ఆగస్టస్ చాప్మెన్ అలెన్, జాన్ కిర్బ్య్ అలెన్ సోదరులచే స్థాపించ బడింది. 1837 జూన్ 5 నుండి
గుర్తింపు పొంది రిపబ్లికన్ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జ్ఞాపకార్ధం హ్యూస్టన్ పేరుతో వ్యవహరించబడసాగింది. శామ్ హ్యూస్టన్ జనరల్‌గా ఉన్న కాలంలో ఈ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బాటిల్ ఆఫ్ శాన్ జాసిన్టో యుద్ధానికి నాయకత్వం వహించం విశేషం. హార్బర్, రైల్ పట్టాల కర్మాగారంతో 1901లో ఆయిల్ నిలువలు కనిపెట్టడం నగరజనాభా క్రమాభివృద్ధికి దోహదమైంది. ఆరోగ్య సంబంధిత పరిశోధనలకు, పరిశ్రమలకు అంతర్జాతీయ కేంద్రమైన టెక్సాస్ మెడికల్ సెంటర్ , మిషన్ కంట్రోల్ సెంటర్ ఉన్న ప్రాంతాలలో స్థాపించబడిన నాసాకు చెందిన స్పేస్ సెంటర్ ఈ నగరంలోనే మొట్టమొదటిగా ప్రారంభించబడ్డాయి.
హ్యూస్టన్ నగరం ఆర్థికరంగం ఇక్కడ అధికంగా స్థాపించబడిన విద్యుత్, వస్తుతయారీ, ఏరోనాటిక్స్, రవాణా, ఆరోగ్య సంబంధిత వస్తు తయారీ కర్మాగారాలపై ఆధారపడి ఉంది. వాణిజ్య పరంగా ఇది గమ్మావరల్డ్ సిటీలలో ఒకటిగా గుర్తించబడింది. ఆయిల్ సంబంధిత వస్తు తయారీలో ఈ నగరం అగ్ర స్థానంలో ఉంది. ఈ నగరంలోని పోర్ట్ ఆఫ్ హ్యూస్టన్ హార్బర్ అమెరికాలో అంతర్జాతీయ జలరవాణాలో మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయ దేశాలనుండి వచ్చి ఇక్కడ అధికంగా స్థిరపడిన ప్రజల కారణంగా విభిన్న సంస్కృతుల నిలయంగా ఈ నగరం మారింది. ఈ నగరం అనేక సాంస్కృతిక సంస్థలకు ప్రదర్శనలకు పుట్టినిల్లు. హ్యూస్టన్ మ్యూజియమ్ డిస్ట్రిక్‌కు సంవత్సరంలో 70 లక్షల సందర్శకులు విచ్చేయడం విశేషం.
హ్యూస్టన్ | |
---|---|
నగరం | |
సిటీ ఆఫ్ హ్యూస్టన్ | |
Nickname(s): స్పేస్ సిటీ (అధికారికంగా), more ... | |
Coordinates: 29°45′46″N 95°22′59″W | |
దేశం | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
రాష్ట్రం | టెక్సాస్ |
దేశాలు | హర్రిస్, బెండ్, మాంట్ గోమెరీ |
Incorporated | June 5, 1837 |
Named for | Sam Houston |
Government | |
• Type | స్ట్రాంగ్ మేయయ్ కౌన్సిల్ |
• Body | హ్యూస్టన్ సిటీ కౌన్సిల్ |
• మేయర్ | సిల్విస్టర్ టర్నెర్ (డెమోక్రటిక్ పార్టీ ) |
Area | |
• నగరం | 671.67 sq mi (1,739.62 km2) |
• Land | 640.44 sq mi (1,658.73 km2) |
• Water | 31.23 sq mi (80.89 km2) |
Elevation | 80 అ. (32 మీ) |
Population | |
• నగరం | 23,04,580 |
• Estimate (2021)[2] | 22,88,250 |
• Rank | 4th in the United States 1st in Texas |
• Density | 3,598.43/sq mi (1,389.36/km2) |
• Urban | 58,53,575 (US: 5th) |
• Urban density | 3,339.8/sq mi (1,289.5/km2) |
• Metro | 71,22,240 (US: 5th) |
Demonym | Houstonian |
Time zone | UTC−6 (CST) |
• Summer (DST) | UTC−5 (CDT) |
ZIP Codes | 770xx, 772xx (P.O. Boxes) |
Area code(s) | 713, 281, 832, 346 |
FIPS code | 48-35000[5] |
GNIS feature ID | 1380948[6] |