క్రికెట్
11 మంది ఆటగాళ్లతో ఆడు ఆట / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ క్రీడ ఐన క్రికెట్ లో వాడేది కూకాబురా అనే చెక్కతో తయారు చేసిన బ్యాటు, క్రికెట్ బంతితో అడతారు. ఈ ఆట రెండు జట్ల మధ్య లేదా రెండూ దేశాల మధ్య జరుగుతుంది . ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు.మైదానం మధ్యలో 20 మీటర్లు పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్కతో చేసిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు. ఆట లోని ప్రతి దశను ఒక ఇన్నింగ్స్ అంటారు. ఒక్కో దశలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తూ వీలైనన్ని పరుగులు సాధిస్తారు, మరో జట్టు బౌలింగ్ చేస్తూ తక్కువ పరుగులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఒక ఇన్నింగ్స్ తరువాత రెండవ సారి బ్యాటింగ్ చేసే జట్టు మొదటి కంటే ఎక్కువ పరుగులు సాధిస్తే అది విజేత అవుతుంది, లేని పక్షంలో మొదటి జట్టు విజేత అవుతుంది.
అత్యున్నత పాలక సంస్థ | అంతర్జాతీయ క్రికెట్ సంఘం |
---|---|
మొదటిసారి ఆడినది | 16వ సతాబ్దం; ఆగ్నేయ ఇంగ్లండులో |
లక్షణాలు | |
సంప్రదింపు | కాదు |
జట్టు సభ్యులు | ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్ళు (కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ళను మార్చే వీలుంది) |
Mixed gender | లేదు. విడివిడి పోటీలుంటాయి |
రకం | బృంద క్రీడ, బ్యాటు బంతితో ఆడే ఆట |
ఉపకరణాలు | క్రికెట్ బంతి, క్రికెట్ బ్యాటు, వికెట్ (స్టంపులు, బెయిళ్ళు), క్రికెట్ దుస్తులు, రక్షణ కవచాలు |
వేదిక | క్రికెట్ మైదానం |
పదకోశం | క్రికెట్ పదకోశం |
Presence | |
దేశం లేదా ప్రాంతం | ప్రపంచవ్యాప్తంగా (కామన్వెల్త్ దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది) |
ఒలింపిక్ | (1900 వేసవి ఒలింపిక్ క్రీడలు) |
బ్యాటింగ్ చేసే జట్టు ఒక వికెట్ వద్ద బౌల్ చేయబడిన బంతిని బ్యాట్‌తో కొట్టి, ఆపై వికెట్ల మధ్య పరిగెత్తి పరుగులు చేస్తుంది. బౌలింగు, ఫీల్డింగు చేసే జట్టు దీనిని నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. బంతిని ఫీల్డ్ నుండి బయటకు రాకుండా నిరోధించడం, బంతిని కింద పడనీయకుండా గాల్లోనే అందుకోవడం ద్వారా బ్యాటర్‌ను అవుట్ చెయ్యడం వంటివి చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. బ్యాటర్‌ను అవుట్ చేయడం అంటే - బౌల్డ్ చేయడం (బాల్ స్టంప్‌లకు తగిలి బెయిల్స్‌ని పడగొట్టడం), లేదా బ్యాట్‌కి తగిలిన తర్వాత గాల్లోకి లేచిన బంతిని నేలను తాకడానికి ముందే గాల్లోనే పట్టుకోవడం, లేదా వికెట్ల మధ్య పరుగెత్తుతున్న బ్యాటర్లు క్రీజు లోకి రాకముందే బంతితో వికెట్‌తో కొట్టడం.
పది మంది బ్యాటర్లు అవుట్ అయినప్పుడు, ఇన్నింగ్స్ ముగుస్తుంది. రెండు జట్లు తమ పాత్రలను మార్చుకుంటాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లలో థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ సహాయంతో గేమ్‌ను ఇద్దరు అంపైర్లు నిర్వహిస్తారు. వారు మ్యాచ్ యొక్క గణాంక సమాచారాన్ని రికార్డ్ చేసే ఇద్దరు స్కోరర్లకు పంపిస్తారు.
ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు, 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారథి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారథియే బాధ్యుడు. జట్టులో మొత్తం 11 మంది ఆడుతారు అయితే బ్యాట్టింగ్ మాత్రమే ఆడేవారు కొందరుంటారు, అలాగే బౌలింగ్ మాత్రమే చేసే వారు కొందరుంటారు, అలాగే రెండూ చేయగలిగేవారు కొందరుంటారు. జట్టు బ్యాట్టింగ్ చేసేటప్పుడు ముందుగా జట్టు వివరాలను నాయకుడు (కెప్టెన్) ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన వివరాలలో ముందుగా బ్యాట్టింగ్ మాత్రమే ఆడే వారిని ప్రకటిస్తాడు వారినే టాప్ ఆర్డర్ బ్యాట్సమ్యాన్ అంటారు తరువాత వచ్చేవారిని మిడిలార్డర్ అని తరువాతి వారిని టెయిలెండర్లు (బౌలర్లు మాత్రమే ) అని అంటారు.
బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.