ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
ఆక్స్ఫర్డ్ లోని విశ్వవిద్యాలయం / From Wikipedia, the free encyclopedia
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో రెండవది. ఇది ఇంగ్లండులోని ఆక్స్ఫర్డ్ నగరంలో ఉంది. దీన్ని స్థాపించిన తేదీ తెలుసుకోవడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 1096 నుంచి ఇక్కడ బోధన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఇది ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా, ప్రపంచంలో రెండో అతి ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది.[9] 1167 లో ఇంగ్లీషు విద్యార్థులు పారిస్ యూనివర్సిటీలో చదవడాన్ని హెన్రీ-2 నిషేధించినపుడు ఈ యూనివర్సిటీ వేగంగా వృద్ధి చెందింది. 1209 లో ఇక్కడి విద్యార్థులకు, ఆక్స్ఫర్డ్ పట్టణ పౌరులకూ మధ్య రేగిన వివాదాల కారణంగా కొందరు పండితులు ఈశాన్యాన ఉన్న కేంబ్రిడ్జికి పారిపోయి, అక్కడ కేంబ్రిడ్జి యూనివర్సిటీని స్థాపించారు.[10] ఈ రెండు యూనివర్సిటీలనూ కలిపి తరచూ ఆక్స్బ్రిడ్జ్ అంటూంటారు.
లాటిన్: Universitas Oxoniensis | |
నినాదం | Dominus Illuminatio Mea (Latin) |
---|---|
ఆంగ్లంలో నినాదం | "The Lord is my Light" |
స్థాపితం | c. 1096[1] |
ఎండోమెంట్ | £4.775 billion (inc. colleges) 2014-15[2] |
ఛాన్సలర్ | Chris Patten |
వైస్ ఛాన్సలర్ | Louise Richardson[3][4] |
విద్యాసంబంధ సిబ్బంది | 1,791[5] |
విద్యార్థులు | 22,602 (December 2015)[6] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 11,603 (2015)[6] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 10,499 (2015)[6] |
ఇతర విద్యార్థులు | 500[7] |
స్థానం | ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండు, UK |
రంగులు | Oxford blue[8] |
క్రీడాకారులు | The Sporting Blue |
అనుబంధాలు | IARU Russell Group Europaeum EUA Golden Triangle G5 LERU SES |
1333–34 లో అసంతుష్ఠులైన పండితులు కొందరు, స్టామ్ఫర్డ్ వద్ద ఓ కొత్త విశ్వవిద్యాలయాన్ని స్థాపించాబోగా, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలు రెండూ కలిసి కింగ్ ఎడ్వర్డ్ 3 కు అర్జీ పెట్టి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. [11] ఆ తరువాత, 1820 ల దాకా ఇంగ్లాండులో మరే కొత్త యూనివర్సిటీ కూడా రాలేదు - లండన్లో కూడా; ఆ విధంగా ఈ రెండూ యూనివర్సిటీలు ద్వి ఛత్రాధిపత్యాన్ని అనుభవించాయి. ఇది పశ్చిమ ఐరోపాలో అసాధారణం.[12][13]