కేక్
From Wikipedia, the free encyclopedia
కేక్ పిండి నుండి తయారైన ఒక మిఠాయి, సాధారణంగా చక్కెర, ఇతర పదార్థాలతో, బేక్ చేసినవి. వాటి పాత విధానాలలో, బ్రెడ్‌లో జరిగిన మార్పులే కేకులు, కానీ ఇప్పుడు కేకులు సులభమైన పద్ధతులలో ఎన్నో రకాలుగా లేదా మరింత ఆకర్షణీయంగా, అంటే పేస్ట్రీలు, మెరింగ్యూస్, కస్టర్డ్స్, పైస్ వంటి ఇతర డెజర్ట్‌ల లక్షణాలతో కలిసిపోతున్నాయి.
కేకులో సాధారంగా కలిపే పదార్ధాలు పిండి, చక్కెర, గుడ్లు, వెన్న లేదా నూనె లేదా నెయ్యి, కొంచం నీళ్ళు, పులియబెట్టే పదార్ధం అంటే బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వంటి పులియబెట్టేవి. కేక్‌లను ఫ్రూట్స్, నట్స్ లేదా డెజర్ట్ సాస్‌లతో (పేస్ట్రీ క్రీమ్ వంటివి), బటర్‌క్రీమ్ లేదా ఇతర ఐసింగ్లతో ఐస్డ్ చేసి, మార్జిపాన్, పైప్డ్ బోర్డర్స్ లేదా క్యాండీడ్ ఫ్రూట్‌తో అలంకరించవచ్చును.[1]