పలక విరూపణ సిద్ధాంతం
భూమి ఉపరితలంలోని కదలికలను వివరించే శాస్త్రీయ థియరీ / From Wikipedia, the free encyclopedia
1967 లో డబ్ల్యు. జే. మోర్గాన్ ప్రతిపాదించిన పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) భూగోళం మీద వివిధ నైసర్గిక స్వరూపాల ఆవిర్భావం, అగ్నిపర్వత ప్రక్రియ, భూకంప ప్రక్రియ వంటి అంశాలను వివరించడానికి ఉపకరిస్తుంది. ఆల్ఫ్రెడ్ వెజ్ నర్ యొక్క ఖండ చలన సిద్ధాంతం (Continental Drift theory), హెస్ (Harry Hess) యొక్క సముద్ర-భూతల వ్యాప్తి (Sea-floor spreading), హోమ్స్ యొక్క సంవహన ప్రవాహాల వంటి దృక్పథాల ఆధారంగా ఈ పలక విరూపణ సిద్ధాంతం రూపొందించబడింది. ఈ సిద్ధాంతం అశ్మావరణం (Lithosphere) కు చెందిన 7 ప్రధాన పలకలు, 10 ఉప పలకలు భూమి యొక్క ఆస్తినో ఆవరణపు (Asthenosphere) చిక్కని శిలాద్రవంలో తేలుతూ వివిధ దిశలలో చలించడాన్ని, దానివల్ల ఏర్పడే భూస్వరూప ప్రక్రియలను వివరిస్తుంది.