బాల్కన్లు
From Wikipedia, the free encyclopedia
బాల్కన్లు, ఆగ్నేయ ఐరోపాలోని ఒక భౌగోళిక ప్రాంతం. [1] [2] బల్గేరియా అంతటా విస్తరించి ఉన్న బాల్కన్ పర్వతాల నుండి ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. దీనిని బాల్కన్ ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు. దీనికి వివిధ భౌగోళిక, చారిత్రక నిర్వచనాలున్నాయి. బాల్కన్ ద్వీపకల్పానికి వాయవ్యంలో అడ్రియాటిక్ సముద్రం, నైరుతిలో అయోనియన్ సముద్రం, దక్షిణాన ఏజియన్ సముద్రం, తూర్పున టర్కిష్ జలసంధి, ఈశాన్యంలో నల్ల సముద్రం లు సరిహద్దులుగా ఉన్నాయి. ద్వీపకల్పపు ఉత్తర సరిహద్దు వివిధ రకాలుగా నిర్వచించబడింది. [3] బల్గేరియాలోని రిలా పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ముసాలా, (2,925 metres (9,596 ft), బాల్కన్లోని ఎత్తైన ప్రదేశం.
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | ఆగ్నేయ ఐరోపా (8–11 దేశాలు) |
అక్షాంశ,రేఖాంశాలు | 42°N 22°E |
విస్తీర్ణం | 466,827–562,614 km2 (180,243–217,226 sq mi) |
అత్యధిక ఎత్తు | 2,925 m (9,596 ft) |
ఎత్తైన పర్వతం | ముసాలా (బల్గేరియా) |
నిర్వహణ | |
జనాభా వివరాలు | |
జనాభా | 6 కోట్లు (ద్వీపకల్పంలో మాత్రమే 4.5 కోట్లు) |
బాల్కన్ ద్వీపకల్ప భావనను 1808లో జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త ఆగస్ట్ జ్యూన్ రూపొందించాడు. [4] బాల్కన్ పర్వతాలు అడ్రియాటిక్ సముద్రం నుండి నల్ల సముద్రం వరకు విస్తరించి, ఆగ్నేయ ఐరోపాలోని ఆధిపత్య పర్వత వ్యవస్థగా ఉన్నాయని అతను పొరపాటు పడ్డాడు. బాల్కన్ ద్వీపకల్పం అనే పదం, 19వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలోని యూరోపియన్ ప్రావిన్సులైన రుమేలియాకు పర్యాయపదంగా ఉండేది. ఇది, భౌగోళిక నిర్వచనం కంటే భౌగోళిక రాజకీయ నిర్వచనంగానే భావించాలి. ఇది 20వ శతాబ్దం ప్రారంభంలో యుగోస్లేవియా రాజ్యాన్ని సృష్టించే సమయంలో మరింత ప్రచారం పొందింది. బాల్కన్ ద్వీపకల్పపు సహజ సరిహద్దుల నిర్వచనం, ద్వీపకల్పానికి ఉన్న సాంకేతిక నిర్వచనానికి లోబడదు; అందువల్ల ఆధునిక భూగోళ శాస్త్రవేత్తలు బాల్కన్ ద్వీపకల్పం అనే ఆలోచనను తిరస్కరించారు. చారిత్రికులు బాల్కన్లను ఒక ప్రాంతం అని భావిస్తారు. ఈ పదం బాల్కనైజేషన్ [బా] అనే ప్రక్రియకు సంబంధించి, కళంకిత పదంగా, అవమానకరమైన అర్థాన్ని పొందింది. [3] [5] ఈ ప్రాంతాన్ని సూచించేందుకు ఆగ్నేయ ఐరోపా అని ప్రత్యామ్నాయంగా వాడతారు.