బౌలింగు సగటు
From Wikipedia, the free encyclopedia
క్రికెట్లో, ఒక ఆటగాడి బౌలింగు సగటు అనేది ఒక వికెట్కు అతను ఇచ్చిన పరుగుల సంఖ్య. బౌలింగు యావరేజ్ ఎంత తక్కువగా ఉంటే బౌలరు అంత మెరుగ్గా రాణిస్తున్నట్లు లెక్క. బౌలర్లను పోల్చడానికి ఉపయోగించే అనేక గణాంకాలలో ఇది ఒకటి. సాధారణంగా బౌలరు మొత్తం పనితీరును అంచనా వేయడానికి ఎకానమీ రేట్, స్ట్రైక్ రేట్లతో పాటు దీన్నీ ఉపయోగిస్తారు.
చార్లెస్ మారియొట్ (ఇంగ్లా) | 8.72 |
ఫ్రెడరిక్ మార్టిన్ (ఇంగ్లా) | 10.07 |
జార్జ్ లోహ్మన్ (ఇంగ్లా) | 10.75 |
లారీ నాష్ (ఆస్ట్రే) | 12.60 |
జాన్ ఫెర్రిస్ (ఆస్ట్రే/ఇంగ్లా) | 12.70 |
టామ్ హోరన్ (ఆస్ట్రే) | 13.00 |
హ్యారీ డీన్ (ఇంగ్లా) | 13.90 |
ఆల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రే/ఇంగ్లా) | 15.00 |
మైక్ ప్రోక్టర్ (దక్షి) | 15.02 |
జాక్ ఐవర్సన్ (ఆస్ట్రే) | 15.23 |
టామ్ కెండాల్ (ఆస్ట్రే) | 15.35 |
అలెక్ హర్వుడ్ (ఆస్ట్రే) | 15.45 |
బిల్లీ బార్నెస్ (ఇంగ్లా) | 15.54 |
జాన్ ట్రిమ్ (వెస్టిం) | 16.16 |
బిల్లీ బేట్స్ (ఇంగ్లా) | 16.42 |
Source: Cricinfo Qualification: 10 wickets, career completed. |
బౌలరు తీసుకున్న వికెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, అతని బౌలింగు సగటు కృత్రిమంగా ఎక్కువ గానో, తక్కువ గానో ఉండే అవకాశం ఉంటుంది, అస్థిరంగా కూడా ఉంటుంది. ఆ తరువాత తీసుకునే వికెట్లు, ఇచ్చే పరుగులను బట్టి వారి బౌలింగు సగటులో పెద్ద మార్పులు జరుగుతాయి. దీని కారణంగా, అత్యుత్తమ బౌలింగు సగటులున్న ఆటగాళ్లను నిర్ణయించేటప్పుడు సాధారణంగా, కొన్ని అర్హత పరిమితులను వర్తింపజేస్తారు. ఈ ప్రమాణాలను వర్తింపజేసిన తర్వాత పరిశీలిస్తే, జార్జ్ లోమాన్కు టెస్ట్ క్రికెట్లో అత్యల్ప బౌలింగు సగటు రికార్డు ఉంది. అతను ఒక్కో వికెట్కు 10.75 పరుగులు ఇచ్చి, 112 వికెట్లు తీసుకున్నాడు.