మానవ పాపిల్లోమా వైరస్
From Wikipedia, the free encyclopedia
మానవ పాపిల్లోమా వైరస్ (human papillomavirus - HPV) మానవుల చర్మం, శ్లేష్మ పొరలకు సంక్రమించే పాపిల్లోమా వైరస్ (papillomavirus) వీటిలో సుమారు 130 HPV రకాలు ఉన్నాయి. కొన్ని వైరస్ రకాలు ఉలిపిరి కాయలు (warts లేదా verrucae) కలిగిస్తే మరికొన్ని కాన్సర్ (cancer) వ్యాధిని కలిగిస్తాయి.అధికంగా (HPV) అంటురోగాలకు లక్షణాలు ఏమి ఉండవు .మానవ పాపిల్లోమా వైరస్(human papillomavirus - HPV),మానవ పాపిలోమా వంశానికి చెందిన డిఎన్ఏ విషక్రిమి(DNA virus ), వల్ల మానవ పాపిల్లోమా అంటువ్యాధి వస్తుంది[6] .చిన్న వయస్సులో లింగసాంగత్యం,పొగతాగటం,అనేక భాగస్వాములు కలిగివుడటం,రోగనిరోధక శక్తి పనితీరు తగ్గిపోవడం దీని లక్షణాలు.అప్పుడప్పుడు గర్భధారణ సమయంలో,HPV తల్లి నుంచి పిల్లలికి రావచ్చు.HPV లింగసాంగత్యం జరిగినప్పుడు జననమండలం (reproductive system) వద్ద చర్మా తాకిడి వాళ్ళ వ్యాపిస్తుంది.ఇది సహజాంగా అంటే మరుగుదొడ్లు,ఇతర తాకిడి వల్ల వ్యాపించదు.ఒక వ్యక్తిక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల HPV కి గురికావచ్చు.HPV మనుషులకు మాత్రమే వస్తుంది.[6]
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
---|---|
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
DiseasesDB | 6032 |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} |
MeSH | {{{m:en:MeshID}}} |
మానవ పాపిల్లోమావిర్స్ అంటువ్యాధి | |
---|---|
పర్యాయపదాలు | మానవ పాపిల్లోమా వైరస్ |
పాపిల్లోమావిర్స్ లర్గె టి యాంటిజెన్ హెలీకాస్ డొమైన్ | |
ప్రత్యేకత | ఇన్ఫెక్షియస్ డిసీజ్ (మెడికల్ స్పెషాలిటీ ),గైనకాలజీ |
లక్షణాలు | తెలియని,మొటిమలు [1][2][3] |
ఉపద్రవాలు | ప్రతుయత్పతి క్యాన్సర్,గొంతు కాన్సర్, గర్భాశయకాన్సర్,జననాంగంకాన్సర్[3] |
కారణాలు | మానవ పాపిల్లోమావిర్స్,ప్రత్యక్ష తాకిడి వాళ్ళ వ్యాపిస్తుంది మానవ పాపిల్లోమావిర్స్[4][5][6] |
నివారణ | HPV టీకామందు, కండోమ్ [4][7] |
తరచుదనం | అందరు ఇదొక సమయం లో అంటువ్యాధికి గురి అవుతారు.[4][8] |
HPV టీకాలు అత్యంత సాధారణ రకాలైన సంక్రమణను నివారించవచ్చు.ప్రభావవంతంగా ఉండటం కోసం,సంక్రమణ వచ్చే ముందు వాడాలి,అందుకు తొమ్మిది, 13 ఏళ్ళ మధ్యలో సిఫారసు చేయబడాలి.పాపనికోలౌ పరీక్ష (పాప్) లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించి గర్భాశయ చిత్రీకరణని చూడటం వంటి గర్భాశయ క్యాన్సర్ చిత్రీకరణ పద్ధతి,ప్రారంభ క్యాన్సర్ లేదా అసాధారణ కణాలను గుర్తించవచ్చు.ఇది మెరుగైన ప్రారంభ చికిత్సకి అనుమతిస్తుంది.చిత్రీకరణ అభివృద్ధి చెందిన ప్రపంచంలో గర్భాశయ క్యాన్సర్ వళ్ళ వచ్చే మరణాల సంఖ్యను తగ్గింది.గడ్డకట్టడం ద్వారా పులిపెరలు తొలగించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా లైంగిక సంక్రమణ వల్ల HPV వ్యాపిస్తుంది.పంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ నుంచి 528,000 కొత్త కేసులు, 266,000 మరణాలు సంభవించాయి.2012 లో,సుమారు 85% అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సంభవించాయి.యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో,ప్రతి సంవత్సరం HPV కారణంగా 27,000 క్యాన్సర్ కేసులు సంభవించాయి .లైంగికంగా చురుకైన యుక్తవయస్సు వాళ్ళల్లో 1% మంది జన్యు(జననేంద్రియ) మొటిమలను కలిగి వున్నారు.పురాతన గ్రీసు కాలం నుంచి మొటిమలను కేసులు వర్ణించగా,వాటి వైరల్ (వైరస్ కు సంబంధించిన )స్వభావం 1907 వరకు కనుక్కోలేదు.