రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల జాబితా
రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు / From Wikipedia, the free encyclopedia
రాజ్యసభ సభ్యులు, భారత పార్లమెంటులో ఒక భాగం. రాజ్యసభలో మన దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు ఉంటారు. కళలు, సాహిత్యం, శాస్త్రాలు సామాజిక సేవలకు అందించిన సేవలకు గానూ 12 మంది సభ్యులను భారత రాష్ట్రపతి ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ (ఆర్టికల్స్ 4 (1), 80 (2) ప్రకారం రాష్ట్రపతికి ఈ హక్కు కల్పించబడింది.[1]