రైట్ ఎసెన్షన్
ఖగోళ నిర్దేశాంకాల్లో ఒకటి / From Wikipedia, the free encyclopedia
రైట్ ఎసెన్షన్ అనేది ఖగోళ వస్తువు ఖగోళంలో ఉన్న స్థానాన్ని తెలిపేందుకు వాడే భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థలో ఒక అంగం. భూమి నిర్దేశాంక వ్యవస్థలో ఉండే రేఖాంశానికి సమానమైనది, రైట్ ఎసెన్షన్. ఖగోళంలో ఒక బిందువు యొక్క రైట్ ఎసెన్షన్ (సంక్షిప్తంగా RA ; చిహ్నం α ) అంటే వసంత విషువత్తు వద్ద (మార్చి 21 నాడు) సూర్యుని నుండి ఖగోళ మధ్యరేఖ వెంబడి తూర్పు దిశగా ఆ బిందువు ఉన్న కోణీయ దూరం. [1] రైట్ ఎసెన్షన్, డిక్లనేషన్ రెంటినీ కలిపి ఖగోళ నిర్దేశాంకాలు అంటారు. ఇవి భూమధ్యరేఖీయ నిర్దేశాంక వ్యవస్థలో ఖగోళంలో ఉన్న బిందువు స్థానాన్ని నిర్దేశిస్తాయి.