హోయాంగ్ హో
పసుపు నది లేదా ఎల్లో రివర్ దీనిని చైనాలో వేలాడే నది అని పిలుస్తారు. / From Wikipedia, the free encyclopedia
పసుపు నది లేదా ఎల్లో రివర్ దీనిని చైనాలో వేలాడే నది అని పిలుస్తారు. ఇది చైనాలో రెండవ పొడవైన నది, ప్రపంచంలోని ఆరవ పొడవైన నది. చైనాలోని కింగ్హై ప్రావిన్స్‌లోని బయాన్ హర్ పర్వతాల శిఖరాల మధ్య ఉద్భవించింది, ఇది క్విన్హై-టిబెట్ పీఠభూమి, సిచువాన్ , గన్సు, నింగ్క్సియా, అంతర్గత మంగోలియా, షాంగ్సీ, హెనాన్, షాన్‌డాంగ్‌తో సహా తొమ్మిది ప్రావిన్సుల గుండా ప్రవహించి చివరకు కెన్లీ బోహై సముద్రంలో కలుస్తుంది. పసుపు నది పరీవాహక ప్రాంతం తూర్పు-పశ్చిమంగా 1900 కిమీ (1,180 మైళ్ళు), ఉత్తరం-దక్షిణంగా 1100 కిమీ (684 మైళ్ళు) విస్తరించి ఉంది. దాని బేసిన్ మొత్తం వైశాల్యం 742,443 చ.కి.మీ (290,520 చదరపు మైళ్ళు). [1]టిబెట్ లో దీన్నీ పీకాక్ రివర్, మంగోలియాలో షార్ మోరోన్ అని ఈ నదిని పిలుస్తారు. పసుపు నది, అయోలియన్ ఒండ్రు ఎత్తైన ప్రదేశంలో ప్రవహించడం వలన గాలిలోని అవక్షేపాలు ఈ పసుపు రంగుకు కారణమవుతాయి. ప్రవాహంలోని నీరు పసుపు రంగులో ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చింది. చైనీస్ నాగరికత పసుపు నది బేసిన్లో ఉద్భవించిందని నమ్ముతారు. దీనిని చైనీయులు 'మదర్ రివర్', 'చైనీస్ నాగరికత యొక్క ఊయల' అని కూడా పిలుస్తారు.
హోయాంగ్ హో | |
---|---|
స్థానం | |
Country | చైనా |
చైనా ప్రావిన్స్ | కింగ్హై, సిచువాన్, గాన్సు, నింగ్సియా, ఇన్నర్ మంగోలియా, షాంక్సీ, షాన్క్సీ,హెనాన్, షాన్సాంగ్ |
భౌతిక లక్షణాలు | |
మూలం | బయాన్ హర్ పర్వతాలు |
• స్థానం | యుషు ప్రిఫెక్చర్, కింగ్హై |
• అక్షాంశరేఖాంశాలు | 34°29′31″N 96°20′25″E |
• ఎత్తు | 4,800 m (15,700 ft) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | బోహై సముద్రం |
• స్థానం | కెన్లీ డిస్ట్రిక్ట్, డాంగియింగ్, షాన్డాంగ్ |
• అక్షాంశరేఖాంశాలు | 37°45′47″N 119°09′43″E |
• ఎత్తు | 0 m (0 ft) |
పొడవు | 5,464 km (3,395 mi) |
పరీవాహక ప్రాంతం | 752,546 km2 (290,560 sq mi) |
ప్రవాహం | |
• సగటు | 2,571 m3/s (90,800 cu ft/s) |
• కనిష్టం | 1,030 m3/s (36,000 cu ft/s) |
• గరిష్టం | 58,000 m3/s (2,000,000 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | ఫెన్ నది |
• కుడి | టావో నది, వీ నది (అనేక చిన్న నదులు) |