2009 నాటి ఉపగ్రహాల ఢీ
2009 లో ఇరిడియం 33, కోస్మోస్-2251 ఉపగ్రహాలు డీకొన్న ఘటన / From Wikipedia, the free encyclopedia
2009 ఫిబ్రవరి 10 న, రెండు సమాచార ఉపగ్రహాలు సైబీరియాకు పైన భూ ఉపరితలం నుండి 789 కిలోమీటర్ల ఎత్తున, 11,7000 మీ/సె. వేగంతో ప్రమాదవశాత్తు డీకొన్నాయి. వీటిలో ఒకటి క్రియాశీలంగా ఉన్న వాణిజ్య ఉపగ్రహం ఇరిడియం 33 కాగా, జీవిత కాలం పూర్తైన రష్యా వారి సైనిక ఉపగ్రహం కొమోస్-2251 రెండవది. [1] [2] [3] [4] [5] [6] ఇలాంటి మహావేగపు తాకిడి రెండు ఉపగ్రహాల మధ్య సంభవించడం ఇదే మొదటిసారి. అప్పటి వరకు జరిగిన మహావేగపు తాకిడులన్నీ ఉపగ్రహం, అంతరిక్ష శిధిలాలు డీకొనడం వల్ల జరిగినవే. [7]