మణిపూర్
భారతదేశంలోని రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
మణిపూర్ (মনিপুর, Manipur) భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రము. దీని రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరామ్, పశ్చిమాన అసోం రాష్ట్రాలున్నాయి. తూర్పున మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
మణిపూర్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
ఇంఫాల్ - 23.80°N 25.68°E / 23.80; 25.68 |
పెద్ద నగరం | ఇంఫాల్ |
జనాభా (2001) - జనసాంద్రత |
2,388,634 (22వ స్థానం) - 107/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
22,327 చ.కి.మీ (23వ స్థానం) - 9 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[మణిపూర్ |గవర్నరు - [[మణిపూర్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1972-01-21 - శివిందర్ సింగ్ సిద్ధు - ఒక్రామ్ ఇబోది సింగ్ - ఒకే సభ (60) |
అధికార బాష (లు) | మణిపురి |
పొడిపదం (ISO) | IN-MN |
వెబ్సైటు: manipur.nic.in | |
మణిపూర్ రాజముద్ర |
మణిపూర్‌లో మెయితీ తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. వారి భాష మెయితీ భాష. దీనినే మెయితిలాన్ అనీ, మణిపురీ అనీ అంటారు. 1992లో దీనిని జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించారు,
మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా పరిగణింపబడుతున్నది. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలులో ఉన్నాయి. మణిపూర్‌కు వచ్చే విదేశీయులు (మణిపూర్‌లో జన్మించిన విదేశీయులు కూడా) "నియంత్రిత ప్రాంత అనుమతి" (Restricted Area Permit) కలిగి ఉండాలి. ఈ అనుమతులు 10రోజులకు మాత్రమే చెల్లుతాయి. యాత్రికులు అనుమతింపబడిన ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఏర్పాటు చేయబడిన టూర్లలో, అదీ 4 వ్యక్తుల గ్రూపులలో, మాత్రమే పర్యటించవలెను. ఇంకా వారు ఇంఫాల్ నగరానికి విమాన ప్రయాణం ద్వారానే అనుమతింపబడుతారు.