ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ను ఇదివరలో సదరన్ స్టార్స్ అని కూడా పిలిచేవారు. ఈ జట్టు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం మెగ్ లానింగ్ కెప్టెన్‌గా, షెల్లీ నిట్ష్కే శిక్షకులుగా ఉన్నారు. మహిళల క్రికెట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కేటాయించిన అన్ని ప్రపంచ ర్యాంకింగ్‌లలో ఆస్ట్రేలియా అగ్రశ్రేణి జట్టు.
త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
ఆస్ట్రేలియా |
మారుపేరు | సదరన్ స్టార్స్ |
---|
అసోసియేషన్ | క్రికెట్ ఆస్ట్రేలియా |
---|
|
కెప్టెన్ | మెగ్ లానింగ్ |
---|
కోచ్ | షెల్లీ నిట్ష్కే |
---|
|
టెస్టు హోదా పొందినది | 1934 |
---|
|
ICC హోదా | ICC పూర్తి సభ్యులు (1909) |
---|
ICC ప్రాంతం | ICC ఈస్ట్ ఆసియా పసిఫిక్ |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[1] |
అత్యుత్తమ |
---|
మవన్‌డే |
1st |
1st (1 అక్టోబర్ 2015) |
---|
మటి20ఐ |
1st |
1st (1 అక్టోబర్ 2015) |
---|
|
|
తొలి మహిళా టెస్టు | v ఇంగ్లాండు at బ్రిస్బేన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, బ్రిస్బేన్; 28–31 డిసెంబర్ 1934 |
---|
చివరి మహిళా టెస్టు | v ఇంగ్లాండు at ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్; 22–26 జూన్ 2023 |
---|
మహిళా టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[2] |
77 |
21/10 (46 draws) |
---|
ఈ ఏడు[3] |
1 |
1/0 (0 draws) |
---|
|
|
తొలి మహిళా వన్డే | యంగ్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తో డీన్ పార్క్ క్రికెట్ గ్రౌండ్, బోర్న్మౌత్; 23 జూన్ 1973 |
---|
చివరి మహిళా వన్డే | v ఐర్లాండ్ at కాజిల్ అవెన్యూ క్రికెట్ గ్రౌండ్, డబ్లిన్; 28 జులై 2023 |
---|
మహిళా వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[4] |
358 |
284/66 (2 ties, 6 no results) |
---|
ఈ ఏడు[5] |
8 |
6/2 |
---|
|
Women's World Cup appearances | 12 (first in 1973 మహిళా క్రికెట్ ప్రపంచ కప్పు) |
---|
అత్యుత్తమ ఫలితం | విజేతలు (1978,1982,1988,1997,1997,2005,2013, 2022) |
---|
|
తొలి WT20I | v ఇంగ్లాండు at కౌంటీ గ్రౌండ్, టౌంటన్; 2 సెప్టెంబర్ 2005 |
---|
చివరి WT20I | v ఇంగ్లాండు at లార్డ్స్,లండన్; 8 జులై 2023 |
---|
WT20Is |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[6] |
174 |
119/50 (5 no results) |
---|
ఈ ఏడు[7] |
11 |
9/2 (0 no results) |
---|
|
Women's T20 World Cup appearances | 8 (first in ICC మహిళా ప్రపంచ ట్వంటీ 20 - 2009) |
---|
అత్యుత్తమ ఫలితం | విజేతలు (2010, 2012, 2014, 2018, 2020, 2023) |
---|
|
|
|
As of 28 జులై 2023 |
మూసివేయి
ఆస్ట్రేలియా జట్టు 1934-35లో ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. రెండు జట్లు ఇప్పుడు మహిళల యాషెస్ కోసం ద్వైవార్షిక పోటీ పడుతున్నాయి. ఈ జట్టుకి న్యూజిలాండ్‌తో చాలా క్రికెట్ చరిత్ర ఉంది, అయితే భారత్, వెస్టిండీస్‌లు క్రమంగా బలమైన ప్రత్యర్థి జట్లుగా అభివృద్ధి చెందాయి,
50 ఓవర్ ల క్రికెట్లో, ఆస్ట్రేలియా అన్ని ఇతర జట్ల కంటే ఎక్కువ మ్యాచ్ లు గెలుచుకుంది. ప్రపంచ కప్‌లను 1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022 సంవత్సరాలలో సాధించింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 లలో ICC మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ విధంగా ట్వంటీ 20 క్రికెట్లో బలమైన విజయాన్ని సాధించింది.
2003లో, మహిళా క్రికెట్ ఆస్ట్రేలియా (WCA), ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు (ACB) కలిసి క్రికెట్ ఆస్ట్రేలియా (CA)గా అనే ఒకే పాలకమండలిని ఏర్పరచాయి. ఆస్ట్రేలియా మహిళలు, బాలికలకు ఈ క్రికెట్ ప్రముఖ క్రీడగా ఉండాలనేది CA సంస్థ ప్రధాన లక్ష్యం. ఇది మహిళల జాతీయ క్రికెట్ లీగ్ (ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ - WNCL), ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) దేశీయ జట్లు ఆ సంస్థ ఆకాంక్షను సాధించాయి.[8]
2020 ఏప్రిల్‌లో ట్రూ నార్త్ (TrueNorth) రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఆస్ట్రేలియా జాతీయ మహిళా క్రికెట్ జట్టు తమ క్రీడా అభిమానులతో బలమైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉందని తెలియ చేసింది.[9][10]