ఆర్కిమెడిస్
గ్రీకు గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు / From Wikipedia, the free encyclopedia
ఆర్కిమెడిస్ ( సుమారు 287 – 212 BC ) గ్రీకు గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీర్, ఆవిష్కర్త, ఖగోళ శాస్త్రవేత్త. అతని జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిసినప్పటికీ, అతను శాస్త్రీయ పురాతన కాలంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకనిగా పరిగణించబడ్డాడు. పురాతన కాలం నాటి గొప్ప గణిత శాస్త్రజ్ఞునిగా ఆర్కిమెడిస్ ప్లవన సూత్రాలను నిర్దేశించాడు. కప్పీలను రూపొందించి వాటి ఆధారంతో ఎక్కువ బరువు ఉన్న వస్తువులనైనా సునాయాసంగా లాగ వచ్చని తెలియజేసాడు. అతను "పై" విలువను కచ్చితంగా లెక్కించాడు. వృత్తంపరిధి, చుట్టుకొలతను నిర్ణయించేందుకు సూత్రాలను కనిపెట్టాడు. జల యంత్రాలు, యుద్ధ యంత్రాలు మొదలైన వాటిని ఎన్నింటినో రూపొందించాడు.[2][3][4][5][6] నిలువెత్తు అద్దాలతో సూర్యుని వేడి కిరణాలను రోమన్ నౌకల మీదికి పరావర్తనం ద్వారా పంపించి ఆ నౌకలను మడుకునేటట్లు అతని చేసాడని కొందరు చెబుతారు.
ఆర్కిమెడిస్ ఆఫ్ సిరక్యూస్ | |
---|---|
జననం | సుమారు 287 BC Syracuse, Sicily, Magna Graecia |
మరణం | సుమారు 212 BC (aged around 75) Syracuse, Sicily, Magna Graecia |
రంగములు |
|
ప్రసిద్ధి |
|
గణితశాస్త్ర పరంగా అతను సాధించిన విజయాలలో పై విలువను కచ్చితంగా నిర్ణయించడం, అతని పేరుతో "ఆర్కిమెడియన్ వర్తులం"ను నిర్వచించడం, పెద్ద సంఖ్యలను నిర్ణయించడానికి ఘాతాలను ఉపయోగించే వ్యవస్థను రూపొందించడం ముఖ్యమైనవి. ద్రవస్థితి శాస్త్రం, స్థితిశాస్త్రము, కప్పీ సూత్రము వంటి భౌతిక శాస్త్ర దృగ్విషయాలకు గణిత శాస్త్ర సూత్రాలనుపయోగించి వివరించిన మొదటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు.
స్క్రూ పంపు, మిశ్రమ కప్పీలు, తన దేశమైన సిరక్యుస్ ను రక్షించేందుకు రూపొందించిన యుద్ధ యంత్రాలు అతను చేసిన ఆవిష్కరణలో ముఖ్యమైనవి.
క్రీ.పూ 212లో సిరక్యూజ్ ను రోమన్లు ఆక్రమించారు. ఎంతో మనస్తాపంతో బాధపడుతున్నప్పటికీ ఆర్కిమెడిస్ వృత్తాల మీద పరిశోధనలు మానలేదు. అతను పరిశీలనలో మునిగి ఉండగా అతని నివాసాన్ని రోమన్ సైనికులు ఆక్రమించి అతనిని ఘాతుకంగా సంహరించారు. అతనికి హాని జరగకూదదనే ఆదేశాలు ఉన్నప్పటికీ అతనిని ఒక రోమన్ సైనికుడు హతమార్చాడు. ఆర్కిమెడిస్ తన గణిత ఆవిష్కరణలను తెలియజేయడానికి తన సమాధిపై గోళం, స్థూపం వంటి వాటిని ఉంచమని కోరాడు. ఆ సమాధిని సిసిరో సందర్శించాడు.
అతని ఆవిష్కరణల మాదిరిగా కాకుండా, ఆర్కిమెడిస్ గణిత రచనలు పురాతన కాలంలో పెద్దగా తెలియదు. అతను ఎన్నో పుస్తకాలను వెలువరించాడు. వాటిలో "ఆన్ ది స్పియర్ అండ్ సిలిండర్", "మెజర్ మెంట్ ఆఫ్ ది సర్కిల్", "అన్ ప్లోటింగ్ బాడీస్", "అన్ బాలెన్స్డ్ అండ్ లీవర్స్" వంటి పుస్తకాలు ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి.[7][8][9]