క్లియోపాత్రా
From Wikipedia, the free encyclopedia
క్లియోపాత్రా VII ఫిలోపేటర్ (జనవరి 69 BC - 10 లేదా 12 ఆగస్టు 30 BC) ఈజిప్టులోని టోలెమిక్ రాజ్యానికి రాణి. 51 నుండి 30 BC వరకు తండ్రి నుండి అధికారాన్ని పొందిన క్లియోపాత్ర రాణిగా 20 ఏళ్లు ఈజిప్టు రాజ్యాన్ని పాలించింది. ఆమె ఈజిప్టుకు చిట్టచివరి ఫారో(Pharaoh).[1]
త్వరిత వాస్తవాలు క్లియోపాత్రా, టోలెమిక్ రాజ్యానికి రాణి (Queen of the Ptolemaic Kingdom) ...
మూసివేయి
క్రీ. పూ. 69లో రాజవంశంలో పుట్టింది క్లియోపాత్ర. ఆమె తండ్రి ఈజిప్టు రాజు 12వ టాలెమీ. టోలెమిక్ రాజవంశానికి చెందిన ఆమె మరణం తరువాత, ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యం ప్రావిన్స్‌గా మారింది. ఆమె మాతృభాష కొయిన్ గ్రీకు, ఈజిప్టు భాషను నేర్చుకున్న ఏకైక టోలెమిక్ పాలకురాలు ఆమె.