మాంటెనెగ్రో
ఐరోపాలో ఒక దేశం / From Wikipedia, the free encyclopedia
మోంటెనెగ్రో: క్రానా గోరా / Црна Гора, మూస: IPA-sh, అనగా "బ్లాక్ మౌంటైన్") ఆగ్నేయ ఐరోపాలో ఉన్న ఒక సార్వభౌమ రాజ్యం. (మోంటెనెగ్రి), మోంటెనెగ్రో దేశ నైరుతి సరిహద్దులో అడ్రియాటిక్ సముద్రం తీరం, పశ్చిమసరిహద్దులో క్రొయేషియా, వాయవ్య సరిహద్దులో బోస్నియా , హెర్జెగొవీనా ఈశాన్య సరిహద్దులో సెర్బియా, తూర్పు సరిహద్దులో కొసావో , ఆగ్నేయ సరిహద్దులో అల్బేనియా ఉన్నాయి. దేశరాజధాని , అతిపెద్ద నగరంగా పోడ్గోరికా నగరం ఉంది. అయితే సెటిన్జే పాత రాజధానిగా (ప్రిజెస్టోనికా) నిర్ణయించబడింది.[8] 9 వ శతాబ్దంలో మూడు సెర్బియా రాజ్యాలు మోంటెనెగ్రో భూభాగంలో ఉండేవి.దాదాపు దక్షిణ అర్ధ భాగంలో డక్లజ, పశ్చిమంలో ట్రవునియా, , ఉత్తరంలో రాస్కియా ఉన్నాయి.[9][10][11] 1042 లో " ఆర్కాన్ స్టీఫన్ వోజ్లవ్వ్ " తిరుగుబాటుకు దారి తీసిన ఫలితంగా బైజంటైన్ సామ్రాజ్యం నుండి డక్జా స్వాతంత్ర్యం , వోజ్లవ్వ్విజేవిక్ రాజవంశం స్థాపన సంభవించాయి. శతాబ్దాలలో అనేక ప్రాంతీయ శక్తులు , ఒట్టోమన్ సామ్రాజ్యం నియంత్రణ తరువాత ఇది 1918 లో యుగోస్లేవియా రాజ్యంలో భాగంగా మారింది. 1945 లో సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా అయింది.
Montenegro Црна Гора క్రానా గోరా | |
---|---|
గీతం: Oj, svijetla majska zoro Ој, свијетла мајска зоро Oh, Bright Dawn of May | |
Location of మాంటెనెగ్రో (Green) on the European continent (Dark Grey) — [Legend] | |
రాజధాని | Podgoricaa 42°47′N 19°28′E |
అధికార భాషలు | Montenegrin[1] |
Other languages in official use[2] |
|
జాతులు (2011) |
|
పిలుచువిధం | Montenegrin |
ప్రభుత్వం | Unitary dominant-party parliamentary constitutional republic |
• President | Filip Vujanović |
• Prime Minister | Duško Marković |
శాసనవ్యవస్థ | Skupština |
Events | |
• Formation of Duklja as a vassal of Byzantine Empire | 625[dubious – discuss] |
• Duklja gains independence from the Byzantine Empire | 1042 |
• Kingdom of Zeta proclaimed | 1373 |
• Prince-Bishopric of Montenegro founded | 1696 |
• Principality | 1 January 1852 |
• Kingdom | 28 August 1910 |
• Formation of Yugoslavia | 1 December 1918 |
• Independence regained | 3 June 2006 |
విస్తీర్ణం | |
• మొత్తం | 13,812 km2 (5,333 sq mi) (156th) |
• నీరు (%) | 1.5 |
జనాభా | |
• 2017 estimate | 678,931[4] (164th) |
• 2011 census | 625,883 |
• జనసాంద్రత | 45/km2 (116.5/sq mi) (121st) |
GDP (PPP) | 2017 estimate |
• Total | $10.862 billion[5] |
• Per capita | $17,439[5] (74th) |
GDP (nominal) | 2017 estimate |
• Total | $4.405 billion[5] |
• Per capita | $7,071[5] (60th) |
జినీ (2013) | 26.2[6] low · 9th |
హెచ్డిఐ (2015) | 0.807[7] very high · 49th |
ద్రవ్యం | Euro (€)b (EUR) |
కాల విభాగం | UTC+1 (CET) |
• Summer (DST) | UTC+2 (CEST) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +382 |
Internet TLD | .me |
|
1992 లో యుగోస్లేవియా విభజన తరువాత సెర్బియా , మోంటెనెగ్రో రిపబ్లిక్లు " రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాగా " ఒక సమాఖ్యని స్థాపించాయి. అయితే యుగోస్లేవియాకు చట్టపరమైన వారసత్వం కలిగించడాన్ని ఇతర మాజీ రిపబ్లిక్లు , యునైటెడ్ నేషన్స్ తిరస్కరించింది. 2003 లో దీనిని సెర్బియా , మోంటెనెగ్రోగా మార్చారు. 2006 మే 21 న స్వతంత్రం గురించి సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా అదే సంవత్సరం జూన్ 3 న మోంటెనెగ్రో స్వాతంత్ర్యం ప్రకటించబడింది. 2007 అక్టోబరు 22 వరకు అధికారికంగా మోంటెనెగ్రో రిపబ్లిక్గా పేర్కొనబడింది.
ప్రపంచ బ్యాంక్ ఈదేశాన్ని ఎగువ మధ్య-ఆదాయ దేశంగా వర్గీకరించింది. మోంటెనెగ్రో యురోపియన్ యూనియన్, నాటో, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐరోపాలో భద్రత , సహకార సంస్థ, యూరోప్ కౌన్సిల్, సెంట్రల్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ , యూనియన్ ఫర్ మధ్యధరా వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.