హోమో హ్యాబిలిస్
21 నుండి 15 లక్షల సంవత్సరాల క్రితం ప్రాచీన మానవ జాతి / From Wikipedia, the free encyclopedia
హోమో హ్యాబిలిస్ అనేది హోమో జీనస్కు చెందిన ప్రాచీన జాతి. ఇది సుమారు 21 - 15 లక్షల సంవత్సరాల క్రితం, ప్లైస్టోసీన్ భౌగోళిక యుగపు గెలాసియన్, తొలి కలాబ్రియన్ దశలలో నివసించింది.[1]
హోమో హ్యాబిలిస్ కాల విస్తరణ: 2.3–1.5 Ma PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
↓ | |
---|---|
KNM-ER 1813 క్రేనియమ్ (రూపం) పక్క నుండి దృశ్యం. నాటుర్మ్యూజియమ్ సెంకెన్బర్గ్ | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | Homo |
Species: | †H. habilis |
Binomial name | |
†Homo habilis లూయీ లీకీ తదితరులు., 1964 | |
ఈ జాతికి చెందిన టైప్ స్పెసిమెన్ (జాతికి గుర్తింపుగా వాడే శిలాజం - జాతికి పెట్టే పేరు ఈ శిలాజ లక్షణాల నుండే ఏర్పడుతుంది) OH 7. దీన్ని 1960 లో టాంజానియాలోని ఓల్డువాయ్ గార్జ్లో కనుగొన్నారు. ఇది ఓల్డోవాన్ రాతి పనిముట్ల పరిశ్రమతో సంబంధం కలిగి ఉంది; ఈ శిలాజాలను హోమో జీనస్లో ఒక ప్రత్యేక జాతిగా గుర్తిస్తూ 1964 లో దీనికి హెచ్. హ్యాబిలిస్ (" హ్యాండీ మ్యాన్") అనే రెండు పదాల పేరు పెట్టారు.[2] రూపం లోను, శరీర నిర్మాణం లోనూ హెచ్. హ్యాబిలిస్, ఆస్ట్రలోపిథెకస్కు, హోమో ఎరెక్టస్కూ మధ్య నున్న జాతి.
కేవలం శిలాజ ఆధారాలు ఉన్నంత మాత్రాన ఓ కొత్త జాతిని సృష్టించవచ్చా, సృష్టిస్తే, దాన్ని హోమో జీనస్లో చేర్చాలా లేక అస్ట్రలోపిథెకస్ జీనస్లో చేర్చాలా, హోమోలో చేరిస్తే హోమో రుడాల్ఫెన్సిస్ ను ఇందులోకి కలిపెయ్యాలా, లేక హెచ్. హ్యాబిలిస్ హెచ్. రుడాల్ఫెన్సిస్ లు రెండూ తొలి హోమో ఎరెక్టస్ నుండి శరీర నిర్మాణ పరంగా పరిణామం చెందినట్లుగానే చూడాలా.. ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే.[3]
హోమో జాతి వర్గీకరణ, అసలు దాన్ని తలపెట్టిన నాటి నుంచీ కూడా వివాదాస్పదం గానే ఉంది.[4] దీన్ని మొట్టమొదటి హోమో ("మానవ") జాతిగా వర్గీకరించడానికి అనుకూలంగా ఉన్న ఒక ప్రధాన వాదన, అది పనిముట్లను ఉపయోగించడం. అయితే, 1990 లో, ఆస్ట్రలోపిథెకస్ జీనస్ లోని కొన్ని జాతులు అంతకంటే ముందే (33.9 లక్షల సంవత్సరాల క్రితం) పనిముట్లను వినియోగించినట్లు కనుగొన్నారు.[5][6]